తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య ఉనికికే విరుద్ధమని రేగిడి మండలం మాజీ ఎంపీపీ కిమిడి రామకృష్ణ నాయుడు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు సంధించే ప్రశ్నలకు వైసిపి సమాధానం చెప్పలేక, చంద్రబాబు రోడ్డు షోలుకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక తప్పుడు కేసులు బనాయించడం
జగన్ రెడ్డి దిగజారుడు
రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు