పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రెల్లివీధి కి చెందిన కీర్తిశేషులు కోలా మూర్తి జ్ఞాపకార్థం కోలా లక్ష్మి సోమవారం నిరుపేద వాడైనా దుప్పాడ లోకేష్ కు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సేవా కార్యక్రమంలో తమ భర్త ముందు ఉండే వారిని జ్ఞాపకం నెమరువేసుకున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు అందరూ ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చింది.