రేగిడి ఆమదాలవలస మండల కేంద్రంలో మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావు నాల్గవ సోదరుడు కిమిడి రామానాయుడు సతీమణి కిమిడి జయలక్ష్మి (72) మృతి చెందారు. మృతి విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి అక్కడకు చేరుకుని జయలక్ష్మికి నివాళులర్పించారు. ఆయనతోపాటు మాజీ జడ్పీటీసీ కిమిడి రామకృష్ణంనాయుడు, మాజీ ఎంపీపీ కిమిడి వేణు సుందరం,
టీడీపీ మండల మాజీ అధ్యక్షులు కిమిడి వినయ్ కుమార్ పాల్గొని తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.