రేగిడి మండలం పనసలవలస గ్రామానికి చెందిన సేవా సమితి గ్రూపు సభ్యులు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు పేద విద్యార్థినిలకు బుధవారం సైకిళ్లు పంపిణీ చేశారు. ఆలాగే పాఠశాలలో చదువుకున్న మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాన్ని ప్రధానోపాధ్యాయురాలు బి సునీత, జిల్లా యువజన నాయకులు కడగల నాగరాజు, గ్రామ పెద్దలు బోడి నాయుడు, శంకర రావు, పెంటం నాయుడు చేతుల మీదుగా అందజేశారు.