అగ్నిబాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ సాయం

2771చూసినవారు
అగ్నిబాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ సాయం
రేగిడి మండలం సంకిలి గ్రామములో ఇటీవల అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన హిట్ రాజు రామలక్ష్మి, చిన్నపన్న అనే బాధిత కుటుంబాలకు.. జిల్లా రెడ్ క్రాస్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, పెంకి చైతన్య కుమార్ లు బుధవారం బట్టలు, బియ్యం, వంట సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను రెడ్ క్రాస్ అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్