సంతకవిటి మండలం మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయులు రవిశంకర్ ఆధ్వర్యంలో ఇటీవల బదిలీ పై వెళ్ళిన ప్రదానోపాద్యాయులు డి. కృష్ణారావు ఆంగ్ల ఉపాద్యాయులు. ఎ. దామోదర రావు, శివరామ కృష్ణ, లక్ష్మి మేడమ్, చంద్ర శేఖర్, సత్యా రావు, కామేశ్వరరావు, రాజ్యలక్ష్మి, విజయ లక్ష్మి, సరస్వతి ఉపాధ్యాయులను దుస్సాలుతో సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, విద్యార్ధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.