Mar 21, 2025, 13:03 IST/మంథని
మంథని
పెద్దపల్లిలో రాళ్ల వాన
Mar 21, 2025, 13:03 IST
పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం రాళ్ల వాన కురిసింది. వేసవికాలం దృష్ట్యా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండతో, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు సాయంత్రం వాతావరణం ఒక్కసారి చల్లబడడంతో కాస్త ఉపశమనం లభించింది. సాయంత్రం పూట భారీ వర్షంతోపాటు రాళ్లు సైతం పడ్డాయి.