సరుబుజ్జిలి: శిథిలావస్థలో తహశీల్దార్ కార్యాలయం
సరుబుజ్జిలి మండల తహశీల్దార్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయానికి సంబంధించిన అన్ని పిల్లర్లు పూర్తిగా బీటలు వారాయి. దీంతో శిథిలమైన భవనంలోనే సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. పిల్లర్లకు పగుళ్లు రావడం వలన కార్యాలయం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. దీని వలన పలు సమస్యలపై కార్యాలయానికి వస్తున్న అర్జీదారులు కూడా భయాందోళన చెందుతున్నారు.