ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఒలింపియాడ్, జెడ్పిహెచ్ఎస్ గీతా నగర్ సిరిసిల్లలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో బోయినపల్లి మోడల్ స్కూల్ కు చెందిన 9వ తరగతి చదువుతున్న లహరికి ద్వితీయ బహుమతిలో భాగంగా మెమెంటోతో పాటు 500 రూపాయలు నగదు బహుమతి అందచేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనరు. ప్రిన్సిపాల్ ఎరువ రఘునాథ్, వైస్ ప్రిన్సిపాల్ ప్రదీప్, టీచర్స్ రాజు, తిరుమల్ బుధవారం అభినందనలు తెలిపారు.