తలగాంలో 11 మంది వాలంటీర్లు రాజీనామాలు

78చూసినవారు
తలగాంలో 11 మంది వాలంటీర్లు రాజీనామాలు
టెక్కలి మండలం తలగాం గ్రామ సచివాలయంలో సోమవారం 11 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. గ్రామ సచివాలయం పరిధిలో మొత్తం 15 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తుండగా 11 మంది రాజీనామా లు చేసి గ్రామ సచివాలయానికి రాజీనామా పత్రాలు అందించారు. మరో ఇద్దరు వాలంటీర్లు రాజీనామా చేస్తారని తెలిసింది. టెక్కలిలో మూకుమ్మడి రాజీనామాలు చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్