టెక్కలి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి నేను కూడా వస్తానని ఆయన రూ. 2కోట్లు ఇవ్వాలని దివ్వెల మాధురి అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇల్లు నిర్మాణానికి రూ. 2కోట్లు ఇచ్చానని నాలుగు చెక్కులను చూపించారు. ఆ ఇంటిపై తనకు కూడా హక్కు ఉందని, మీడియా సాక్షిగా నేను కూడా అక్కడ కూర్చుంటానని అని ఆమె పేర్కొన్నారు.