శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పి. ఎమ్. పి. లు, ఆర్. ఎమ్. పి. లు ఎలాంటి అల్లోపతి వైద్యం చేయడానికి అర్హులు కాదని డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ బి. మీనాక్షి శుక్రవారం తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ అబార్షన్లు, ఐ. వి ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు చేస్తున్నారని అవి వికటించి ప్రాణహాని కలిగిస్తున్నాయని అన్నారు. డ్రెస్సింగ్, ప్రథమ చికిత్స చేయడానికి మాత్రమే అర్హులన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.