టెక్కలిలో 108 సిబ్బంది గత 20 రోజులుగా నిరసనలు చేస్తే చేపట్టిన సమ్మె వాయిదా పడినట్లు రాష్ట్ర 108 ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కిరణ్ మంగళవారం తెలిపారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. పెండింగ్ ఉన్న జీతాలు, ఉద్యోగ భద్రతతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాని యెడల సమ్మెకు దిగుతామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.