రాష్ట్రంలో మంత్రుల పేషీల్లో అవినీతి పెరిగిపోతోందని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు ఆదివారం టెక్కలి లో ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, హోంమంత్రి అనిత పేషీల్లో అవినీతిపై మీడియాలో కథనాలు వస్తున్నాయని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, ఎవరిపై చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.