టెక్కలి: ఎండల మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

69చూసినవారు
టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మూడవ సోమవారం పర్వదినం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సోమవారం వేకువజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ కారణంగా క్యూ లైన్లో తోపులాట జరిగింది. అధికారుల పర్యవేక్షణపై పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్