టెక్కలిలో తూర్పు కాపు ఆత్మీయ కలయిక కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కుమారుడు.. రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. తూర్పుకాపుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.