AP: సూపర్ సిక్స్ హామీల అమలును కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. బుధవారం వైసీపీ ఆవిర్భావ వేడుక సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజల కష్టాల నుంచే వైసీపీ ఆవిర్భవించింది. ప్రతిపక్షంలో ఉండటం మనకు కొత్త కాదు. 15 ఏళ్లలో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి.’ అని అన్నారు.