భూమధ్య రేఖకు సమీపాన హిందూ మహాసముద్రానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అయితే ఇది బలపడినా శ్రీంక తీరం దిశగా వెళ్తోంది. దీని ప్రభావం ఏపీపై ఏమీ ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. వరుసగా తుఫాన్‌లతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తాజాగా తుఫాన్ భయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.