దేశంలోనే పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన డేటా ప్రకారం.. దాదాపు రూ.931 కోట్లతో దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలువగా రూ.15 లక్షల ఆస్తితో మమతా బెనర్జీ చివరి స్థానంలో ఉన్నారు. అలాగే ధనిక సీఎంలలో పెమా ఖండూ (అరుణాచల్) రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో, మూడో స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నిలిచారు.