ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కాగా రాష్ట్రంలో ఇంకా వెలువడాల్సిన రెండు పట్టభద్రుల స్థానాల ఎన్నికల ఫలితాలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ స్థానాల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి అచ్నెన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఉత్తరాంధ్రలో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొండిన విషయం తెలిసిందే.