గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం PM-KUSUM పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని మూడు విభాగాల్లో అమలు చేసేందుకు ప్రణాళికలు రచించింది. మొదటిది రైతులు, పంచాయతీలు, సహకార సంస్థలు చిన్న యూనిట్లు ఏర్పాటు చేస్తారు. మరో విభాగంలో 20 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఏర్పాటు చేస్తారు మూడో విభాగంలో 15 లక్షల పంపుసెట్లను గ్రిడ్‌కు అనుసంధానిస్తారు.