ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తారి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ మృతిచెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. నక్సలైట్ శిబిరాన్ని DRG సైనికులు ధ్వంసం చేశారు. ఖల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదగిరి అడవుల్లో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కొండ ప్రాంతంలో 25 నుంచి 30 మంది నక్సలైట్లు ఉన్నట్లు సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి.