AP: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై కీలక ప్రకటన చేసింది. అందరికీ ఇళ్లు పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని అందజేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం రూ. 4 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రేషన్ కార్డు ఉండి 5 ఎకరాల లోపు మెట్ట భూమి, 2.5 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్న వారు మాత్రమే అర్హులని వివరించారు. ఇప్పటికే సొంతిల్లు ఉన్నా, గతంలో రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇళ్లు పొందిన వారు అనర్హులు.