ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి లక్కవరంలో చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. దాంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికిి చేరుకుని చర్యలు చేపట్టారు.