AP: వైసీపీ అధినేత జగన్ పై BJP MLC సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. గతంలో 60 సీట్లు వచ్చినప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలంటున్నారని ఆయన విమర్శించారు. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమని, ఆ పార్టీకి 20% ఓట్లు కూడా రాకుండా చేస్తామని పేర్కొన్నారు. జగన్ కు మళ్లీ అధికారమిస్తే అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకుల వల్లే నష్టపోయిందని ఆరోపించారు.