ప్రాణం తీసిన అతివేగం (వీడియో)

74చూసినవారు
AP: కడప జిల్లా బద్వేల్ పట్టణం మైదుకూరు రోడ్డులోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో సుధీర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సుధీర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుధీర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో భార్యాపిల్లలు గుండెలవిసేలా రోదించారు.

సంబంధిత పోస్ట్