నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అటు నిర్మాతగా ఇటు హీరోగా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీలలో ‘ది ప్యారడైజ్’ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో నాని సరసన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.