AP: రాష్ట్రంలోని వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తమకు చేసిన మోసాన్ని మరోసారి ఎండగట్టేందుకు వాలంటీర్లు సోమవారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అన్ని ప్రాంతాల నుంచి వాలంటీర్లు ఈ ధర్నాకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 వేల గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయనున్నారు.