ఇది చారిత్రాత్మక విజయం: చంద్రబాబు

85చూసినవారు
ఇది చారిత్రాత్మక విజయం: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ 5 ఏళ్ల పరిపాలన నేను ఎన్నడూ చూడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారో చూశాం. ఇవి ఊహించని పరిణామాలు. టీడీపీ గెలుపు ఒక చారిత్రాత్మక విజయం. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. ఏది ఎవరికి శాశ్వతం కాదు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే ప్రజలు ఆదరిస్తారు. లేకుంటే ఆదరించరు. ఈ ఐదేళ్లలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైంది. అప్పులు పెరిగాయి.’ అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్