బిచ్చమేశాడని కేసు నమోదు

55చూసినవారు
బిచ్చమేశాడని కేసు నమోదు
ఓ గుడి ఎదుట యాచకురాలికి డబ్బులు ఇస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌‌లో చోటుచేసుకుంది. యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు అక్కడి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బిక్ష వేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. ఇది రుజువైతే అతడికి జైలు శిక్ష కూడా పడే అవకాశముంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 223 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్