తమిళనాడు మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌పై ఈడీ కీలక చర్యలు తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో ఆయనకు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. తూత్తుకుడి, మదురై, చెన్నైల్లో మంత్రికి చెందిన స్థిరాస్తులను అటాచ్ చేయాలని పీఎంఎల్‌ఏ కింద ఆదేశాలు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. 2001-2006 మధ్య కాలంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను అనిత ఆర్ రాధాకృష్ణన్ గడించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి.