100 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీరామ భజనమందిరం శిథిలావస్థకు చేరింది. ఎండోమెంట్ సహకారంతో నూతన మందిరాన్ని నిర్మిస్తుంటే ఆ స్థలం కబ్జాకు ఓ కుటుంబం యత్నిస్తుందని తిరుపతి రూరల్ మండలం, కాలూరు గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. శిథిలావస్థకు చేరుకున్న శ్రీరామ భజనమందిరాన్ని నిర్మాణం చేపడుతుంటే అదే గ్రామానికి చెందిన చింతకాయల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని తెలిపారు.