చంద్రగిరి మండలం కొత్త శానంబట్లలో బుధవారం జల్లికట్టు ఉత్సాహంగా సాగింది. రంకెలేసే కోడె గిత్తలను అడ్డుకుని వాటి కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈక్రమంలో జల్లికట్టులో అపశృతి జరిగింది. ఎద్దులను పట్టుకునే క్రమంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.