గంజాయి విక్రయించినా, సేవించినా చట్టపరంగా శిక్షార్హులని చంద్రగిరి సీఐ పి. సుబ్బరామిరెడ్డి హెచ్చరించారు. ఆదివారం సీఐ చంద్రగిరిలో మాట్లాడుతూ గంజాయి విక్రేతలతో పాటు మరో 5మందిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఎం. కొంగరవారిపల్లి జగనన్న కాలనీలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించమని, ఈ దాడుల్లో ఇద్దరు మహిళలతో పాటు మరో 5మంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.