శాప్ చైర్మన్ ని కలిసిన తెలుగు యువత సభ్యులు

68చూసినవారు
శాప్ చైర్మన్ ని కలిసిన తెలుగు యువత సభ్యులు
శాప్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనిమిని రవి నాయుడుని శుక్రవారం తెలుగు యువత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవి నాయుడుని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చంతో పాటుగా శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి కె. వి. కె ప్రసాద్, తిరుచానూరు తెలుగు యువత నాయకులు దిలీప్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్