తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సందర్భంగా టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనశాలను గురువారం టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులు, రామాయణ, మహాభారతంలోని పలు ఘట్టాల నమూనాలు చూడ చక్కగా ఉన్నాయని ప్రశంసించారు.