టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది రకాల 20 వేల కట్ ఫ్లవర్స్ తో 3 రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయ వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో ద్రాక్ష, బత్తాయి, మొక్కజొన్న వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు.