మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీసర్లు ఈ వారంలోపు 50 హెక్టార్లకు తక్కువ కాకుండా రైతుల వాటాను చెల్లించేలా అవగాహన కల్పించేలా చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా బిందు, తుంపర్ల సేద్య పరికరాలు సబ్సిడీతో అందించే అంశమై ఆర్ఎస్ఎ్క ఇంచార్జీలతో సమీక్షించారు.