చిత్తూరు జిల్లాలో పీఎం ఎస్ హెచ్ ఆర్ ఐ స్కూల్స్ కింద ఎంపికైన మొత్తం 40 పాఠశాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యాశాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖ అధికారులను గురువారం ఆదేశించారు. ఎంపికైన పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆట స్థలాలు, ల్యాబ్స్ అభివృద్ధి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.