కార్వేటినగరం మండలంలోని ఆలత్తూరు సచివాలయాన్ని డిఎల్ఏటిఓ డాక్టర్ వెంకటప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాటర్ క్వాలిటీ టెస్టులు ఎలా చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. డయేరియాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేయాలన్నారు. మంచినీటి పైపులైన్లు లీకేజి కాకుండా చూసుకోవాలన్నారు. వాటర్ నమూనాలో బయాలాజికల్ కంటామినేషన్ రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు.