చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా సమన్వయ ఇన్ఛార్జ్ ప్రభావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం రోగులకు అందుతున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నూతన భవన నిర్మాణాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.