గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను సోమవారం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీస్తు జననం, బోధనలను వివరించారు. క్రీస్తు సూచించిన అహింస మార్గంలో నడవాలని సూచించారు. పలు చర్చిలకు విద్యుత్ దీపాలను అలంకరించారు. జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి.