వెదురు కుప్పం: మేకల దొంగలు అరెస్ట్

68చూసినవారు
వెదురు కుప్పం: మేకల దొంగలు అరెస్ట్
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం పరిసర ప్రాంతాలలో మేకలను దొంగతనం చేసే చెంచయ్య, శరత్ బాబును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిందితుల నుండి సుమారు 7 మేకలను, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని పోలీస్ అధికారులు తెలియజేశారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్