చిత్తూరు జిల్లా , గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం సురేంద్రనగర్ పంచాయతీ పరిధిలో బుధవారం సీఐ హనుమంతప్ప ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా. ఐదు గ్రానైట్ లారీలు ఓవర్ లోడ్ కలిగి ఉండి వాహనాలకు ఎటువంటి రికార్డులు లేకుండా ఉండడాన్ని గుర్తించి సీజ్ చేయడం జరిగిందని సీఐ తెలిపారు. ఈ విషయాన్ని చిత్తూరు మైన్స్ అధికారులకు తెలియజేసి లారీలను అప్పగించారు.