చిల్లకూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా వి. వి వెంకట సూర్య సాయి మంగళవారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం, శాలువాతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కార్యాలయ సిబ్బంది అందరినీ ఆయన పరిచయం చేసుకున్నారు. అనంతరం పలువురు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతి, డిజిటల్ సహాయకులు రమణ పాల్గొన్నారు.