విజయవాడ వరదల్లో నెల్లూరు జిల్లా మహిళ మృతి
విజయవాడ వరదల్లో నెల్లూరు జిల్లా యువతి మృతి చెందింది. లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన ఏస్. వరలక్ష్మి (38) విజయవాడ వాంబే కాలనీలో నివాసముంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. ఆ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టడంతో వారు ఉంటున్నవాసంలోకి కూడా నీళ్లు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులను కాపాడే ప్రయత్నంలో నీటిలో మునిగి ఊపిరాడక ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు.