దగదర్తి మండలంలోని డిప్యూటీ తహసిల్దార్ గోపికృష్ణ ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు అవార్డు వరించింది. గురువారం నెల్లూరు నగరంలో జరిగిన పెరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పలువురు ఉద్యోగులు సన్నిహితులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.