కావలి పట్టణంలోని శ్రీ వాసవి మాత అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి దేవస్థానాన్ని ప్రత్యేక పుష్పాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు