శాంతిపురం మండలం బడుగుమాకులపల్లి గ్రామంలో మంగళవారం పశువైద్యశాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ప్రధానంగా పశువులకు గాలికుంట వ్యాధి సోకకుండా టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు విశ్వనాధ్ నాయుడు మాట్లాడుతూ. పశువులకు గాలికుంట వ్యాధి సోకకుండా ముందుగా టీకాలు వేయించాలని పాడి రైతులకు సూచించారు. ముందుగా టీకాలు వేయించుకుంటే గాలికుంట సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.