నగిరి నియోజకవర్గం, పుత్తూరులోని తిరుపతి, చెన్నై జాతీయ రహదారి పున్నమి సర్కిల్ వద్ద గంజాయి విక్రయిస్తున్న తమిళనాడుకు చెందిన ప్రభాకరన్ (25), మేఘాద్రి (35)ని అరెస్టు చేసినట్లు సీఐ సురేంద్ర నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వారి నుంచి 17 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.